వేగంగా ప్రయాణిస్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల మీద ఓ గుర్తు తెలియని వ్యక్తి(45) మృతదేహం పడి ఉన్నట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కదులుతున్న రైలులో నుంచి పడి వ్యక్తి మృతి - A man died after he fell from a speeding train in secunderabad
వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వ్యక్తి మృతి
మృతుడి వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఆ వ్యక్తి రైలు డోరు వద్ద నిల్చుని ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:రొయ్యల పరిశ్రమపై గ్రామస్థుల ఆగ్రహం.. రూ.50 లక్షల నష్టం