ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ప్రధాన సివిల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి కుప్పకూలి పరీక్షా కేంద్రంలోనే మృతి చెందారు. మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన పులి బండ్ల భూషయ్య కరోనా లక్షణాలు ఉండడం వల్ల పరీక్ష కోసం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కరోనా పరీక్షలకు వచ్చి.. మృత్యు ఒడికి..! - తెలంగాణ వార్తలు
కరోనా పరీక్షల కోసం వచ్చి మృత్యుఒడికి చేరుకున్నారు ఓ వ్యక్తి. లక్షణాలు ఉండడం వల్ల కరోనాగా అనుమానించి ఖమ్మం జిల్లా మధిర ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసే లోపే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
![కరోనా పరీక్షలకు వచ్చి.. మృత్యు ఒడికి..! a man dead at covid tests center, madhira hospital dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:22:27:1621407147-11814971-dead.jpg)
కరోనా పరీక్ష కేంద్రంలో వ్యక్తి మృతి, మధిర ఆస్పత్రిలో వ్యక్తి మృతి
పరీక్షల కోసం ఎదురుచూస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయారని అన్నారు. వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించి... అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.