మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక రశ్మి రంజన్ బెహర అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన రశ్మి రంజన్ బెహర 10 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చాడు. పాపిరెడ్డినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాంపల్లిలోని ఓ వర్క్‌షాప్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
రశ్మి రంజన్ బెహరకు ఈ మధ్య అప్పులు ఎక్కువయ్యాయి. మనస్తాపానికి గురైన బెహర.. పాపిరెడ్డినగర్ దగ్గరలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బెహరగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు మృతి