జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను నీటిలో మునిగిపోతున్న దృశ్యాలను స్థానికులు చరవాణిలో చిత్రీకరించారు. అతను కాల్వ ఒడ్డున వదిలిన వాహనం మాత్రం కటకం గంగాధర్ పేరుతో నిజామాబాద్ రిజిష్ట్రేషన్ కలిగి ఉంది.
live video: కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - తెలంగాణ వార్తలు
ఓ వ్యక్తి చూస్తుండగానే నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు ఎక్కువగా ఉండటంతో అతన్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆత్మహత్య
అతను నీటిలో దూకినప్పుడు పంప్ హౌస్ వద్ద 500 మీటర్ల లోతు నీరు ఉండటంతో అతన్ని కాపాడే ప్రయత్నం స్థానికులు చేయలేదు. నీటిలో దూకిన తర్వాత కొద్దిసేపు పైకి తేలినప్పటికీ ఆ తర్వాత మునిగిపోయాడు. అతన్ని వెలికి తీస్తేనే అతను ఎవరో తెలిసే అవకాశం ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్నివెలికి తీశారు.
ఇదీ చదవండి:ACB RIDES: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన డీఎఫ్వో