భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో జరిగింది.
జిల్లాలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన షేక్ సలీమ్ (35)కు ఏడాది క్రితం భార్యతో గొడవైంది. ఈ కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. సలీమ్ తన స్వగ్రామంలోనే ఉండగా.. అతని భార్య రామచంద్రాపురం గ్రామంలో పిల్లలతో కలిసి తన తల్లిదండ్రులతో ఉంటోంది.