తెలంగాణ

telangana

ETV Bharat / crime

Lockdown effect: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య - ఘట్‌కేసర్‌

కరోనా మహమ్మారి వల్ల చిన్నభిన్నమవుతున్న కుటుంబాల వ్యథలు కంటతడిని పెట్టిస్తున్నాయి. పలు కుటుంబాల్లో చేతి నిండా పని లేక, కుటుంబ పోషణ సైతం భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాగుడుకు బానిసై, ఆర్థిక ఇబ్బందులు భరించలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో జరిగింది.

A man commits suicide
lockdown effect: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jun 3, 2021, 8:14 PM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లాక్​డౌన్(Lock down)​ సమయంలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మర్పల్లిగూడకు చెందిన ఈదుగల్ల మల్లేశ్​(35) స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమంలో దినసారి కూలీగా పని చేసేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనిలేకపోవడం వల్ల ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆర్థిక కారణాల నేపథ్యంలో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. ఈ తరుణంలో కొన్ని రోజులుగా భార్యతో గొడవ పడుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివారులో ఉన్న సుద్దబావి ఒడ్డున మల్లేశ్ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బావిలో నుంచి మృతదేహం బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్‌ కారణంగా పని లేకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపారు.

ఇదీ చూడండి:Accident: బైక్​పై వేగంగా వచ్చి.. పోలీసులనే ఢీకొట్టి..

ABOUT THE AUTHOR

...view details