Sucide in secunderabad railway station: భార్య మరొకరితో వెళ్లిపోయిందని మనస్తాపంతో గూడ్స్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జైభజరంగ్ (32) స్థానికంగా కూలీ పనిచేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఏడు రోజుల క్రితం పిల్లలను ఇంటి వద్ద వదిలిపెట్టి వేరొకరితో వెళ్లిపోయింది.
హైదరాబాద్‌కు వచ్చి ఉంటుందని భావించిన అతను మూడు రోజుల క్రితం నగరానికి వచ్చి బంధువులను కలిశాడు. ఆమె జాడ తెలియకపోవడంతో తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు బంధువులతో కలిసి గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. వారు టికెట్ తెచ్చేందుకు వెళ్లగా రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరి వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.