శస్త్ర చికిత్సకోసం డబ్బు అవసరమై భూమిని అమ్మగా... ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిష్ట్రేషన్ చేయకుండా తహసీల్దారు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా దోమ మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో పెట్రోల్‌పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.
దోమ మండలం తిమ్మయిపల్లికి చెందిన సత్యయ్య.... ఆస్పత్రి ఖర్చుల కోసం తనకున్న ఎకరా 20 గుంటల భూమిలో ఎకరా భూమిని హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి అమ్మాడు. అయితే ఈ భూమికి సంబంధించి కొనుగోలుదారుపేరుపై రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పటికే మూడు సార్లు ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నాడు. కానీ భూమి రిజిస్ట్రేషన్‌ను చేయడం లేదు. ఈ విషయమై తహసీల్దారుకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు.