ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. భవనంపై నుంచి దూకేస్తానంటూ గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవల్లో పోలీసులు సహకరించాలని కోరాడు.
గొడవలతో..
మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన పసుపులేటి శేఖర్‌కు అతని భార్యకు మధ్య గొడవలు జరగటంతో ఆస్పత్రిపైకి ఎక్కి కిందికి దూకుతానని బెదిరించాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తితో.. అతని భార్య ఫోన్లో మాట్లాడుతోందని చెప్పాడు.