భార్య కాపురానికి రావడం లేదని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు ఓ వ్యక్తి. కార్యాలయం ఆవరణంలోని టవర్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన సురేష్.. మంచిర్యాల పట్టణానికి చెందిన యువతిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తామామ తన భార్యా పిల్లలను పంపించడం లేదని సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు నాలుగు గంటలపాటు హంగామా సృష్టించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.
భార్య కాపురానికి రావడం లేదని.. సెల్ టవర్ ఎక్కి బెదిరింపులు - A man climbed a cell phone tower in mancherial district
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. భార్య కాపురానికి రావడం లేదని ఆవేదన చెందుతూ టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మంచిర్యాలలో సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
పట్టణ సీఐ ముత్తి లింగయ్య.. సురేష్ భార్యకు ఫోనులో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె రావడానికి నిరాకరించింది. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సురేష్ ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్న చిన్నారి... ప్రాణభిక్ష పెట్టాలంటున్న తల్లి