'మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూశాను.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందామంటే' నమ్మింది. ఫోన్ మాట్లాడుతూ... ఓ రోజు అతడితో ఏకాంతంగా గడిపింది(cheating with marriage proposal). ఆ వీడియోలు అంతర్జాలంలో ప్రత్యక్షం కావడంతో ఆమె కంగుతింది(matrimony love fraud in hyderabad). సరూర్‌నగర్ చెందిన బాధితురాలు(30) మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంది. ఓ రోజు 95732 05940 నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది.
పరిచయం ఇలా..
అటువైపు నుంచి సుభాష్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. హైటెక్ సిటీలో ఉంటానని, ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నానంటూ నమ్మబలికాడు. జీతం రూ.లక్షకు పైగా వస్తుందని చెప్పాడు. ఆమె ప్రొఫైల్ తనకు బాగా నచ్చిందని... ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. కొంతకాలం అలా చాటింగ్... ఆపై తరచూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఒకరి అభిరుచులు మరొకరు పంచుకున్నారు. ఓరోజు కలుద్దామని మాదాపూర్‌కు ఆమెను రమ్మన్నాడు. ఇద్దరు ఏప్రిల్ 27న ఓ రెస్టారెంట్‌లో కలిశారు. భోజనం తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత అవి అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి(cheating with marriage proposal).