రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కలెక్టరేట్‌లో ఉద్యోగిని అని చెప్పి వనస్థలిపురం పరిధిలోని రైతు బజార్ వద్ద ఉన్న రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానని సుబ్రహ్మణ్యశర్మ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇప్పటికే 13 మంది వద్ద రూ.27 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించాడు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు - 13 members cheated by one man
రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని ఓ బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. తనలాగే మరో 13 మంది నుంచి రూ.27 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు
కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కొత్తపేటలో నివాసం ఉండే సుబ్రహ్మణ్యశర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇదీ చూడండి:జ్యోతిష్యాలయంలో లైంగిక వేధింపులు..!