తెలంగాణ

telangana

ETV Bharat / crime

తాగిన మైకంలో సీసాతో పొడిచి హత్య - తెలంగాణ వార్తలు

తాగితే మనిషి పశువుగా ఎలా మారతాడో ఈ ఘటన కళ్లకు కట్టింది. తాగిన మైకంలో ఓ వ్యక్తి సీసాతో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం చింతగట్టులో జరిగింది.

murder
హత్య

By

Published : Apr 16, 2021, 1:32 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం చింతగట్టులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మోతె చందు అనే వ్యక్తిని అభినవ్ సీసాతో పొడిచి చంపాడు. మోతె చందు, అభినవ్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. తాగిన మైకంలో చిన్న పాటి గొడవ పెద్దదై ఇద్దరు కొట్టుకున్నారు.

తాగిన మైకంలో ఆవేశంతో ఉన్న అభినవ్.. చందును సీసాతో పొడిచాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయిన చందు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్​ ఎంజీఎంకు తరలించారు.

తాగితే ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. మద్యం తాగటంతో చందు భార్య ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

ఇదీ చదవండి:బైక్​ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details