గ్యాస్ సిలిండర్ తీసుకొస్తానని చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. గొల్లపల్లి గ్రామపంచాయతీ కుమ్మేరా గ్రామానికి చెందిన కుంకుర్తి నర్సిములు(64) సిలిండర్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు.
చేవెళ్లలో వ్యక్తి దారుణ హత్య - చేవెళ్ల వార్తలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం జరిగింది. ఇంటి నుంచి గ్యాస్ కోసం వెళ్లిన వ్యక్తిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు.
వ్యక్తి దారుణ హత్య
ఎంత సేపటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలించగా గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:అర్ధరాత్రి ఇంట్లోకి ఎంటరై.. ఇటుకతో చంపిన దుండగుడు