సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో దారుణం జరిగింది. విందులో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి హత్యకు (Murder) కారణమైంది. మండలంలోని హోతి(కె) శివారులో పలువురు లారీ డ్రైవర్లు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా మాటా పెరిగి హత్యకు దారి తీసింది.
Murder: జహీరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య - వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణ హత్య
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశాడు.
![Murder: జహీరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:49:54:1623115194-tg-srd-26-07-driver-daruna-hatya-av-ts10059-07062021191715-0706f-1623073635-22.jpg)
sangareddy crime news
జహీరాబాద్ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీకు చెందిన లారీ డ్రైవర్ జగదీష్‌ను మరో లారీ డ్రైవర్… తలపై బండరాయితో మోది దారుణంగా హత్య (Murder) చేశాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శంకరరాజు, సీఐ రాజశేఖర్ ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్... చికిత్స పొందుతూ మృతి