ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని సీతాఫల్మండి బస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సుదర్శన్ అనే వ్యక్తి తన భార్యను చున్నీతో గొంతు బిగించి హతమార్చాడు. సుదర్శన్, సౌందర్య దంపతులది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సీతాఫల్మండి బస్తీలో నివాసముంటున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్పర్ధలతో చంపేశాడు..! - seethafalmandi murder case news
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలూ పుట్టారు. ఇంతలోనే మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి ఎంతలా అంటే.. మనసిచ్చి మనువాడిన భార్యనే అంతమొందించేంతలా. కనికరం లేకుండా ఆలి ఉసురు తీసేంతలా..
భార్యను చంపిన భర్త
ఈ క్రమంలోనే భార్యను ఎలాగైనా అంతమొందిచాలనుకున్న సుదర్శన్.. పథకం రచించాడు. ఆ ప్రకారం ఆదివారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. సౌందర్య మత్తులో ఉండగా.. సుదర్శన్ చున్నీతో సౌందర్య గొంతు బిగించి చంపేశాడు. అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: దారుణం: రూ.1000 కోసం 13 కత్తిపోట్లు.. బాధితుడి పరిస్థితి విషమం