హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది (old city brutal murder) . హస్మాబాద్ బండ్లగూడ రోడ్డుపై బార్కస్ ప్రాంతానికి చెందిన హమీద్ జుబేది... కారులో వెళ్తుండగా మారణాయుధాలతో దాడి చేసి నిందితులు హతమార్చారు (old city brutal murder).
అదే కారణమా..?
మృతుడు హమీద్ 2019లో రయీస్ జాబ్రీతో దుబాయ్ నుంచి కేజీ బంగారాన్ని హైదరాబాద్‌కు తెప్పించాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు రయీస్ జాబ్రిని అదుపులోకి తీసుకొని పాస్‌పోర్టు జప్తు చేసి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రయీస్ జాబ్రీ తన పాస్‌పోర్ట్ విడిపించడంతోపాటు డబ్బులు ఇవ్వాలని హమీద్‌తో గొడవపడుతున్నాడు. ఇదే విషయమై హత్య జరిగిన కొన్ని గంటల ముందే మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.