జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారు ఆరపేట్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానిక శివాలయం ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఉన్న వ్యక్తిని కిరాతకంగా తలపై కొట్టి చంపారు.
నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్య
మెట్పల్లి శివారు ఆరపేట్లో హత్య జరిగింది. గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఉంటున్న వ్యక్తిని గుర్తితెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
murder, metpalli
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నిర్మల్ జిల్లా కడెం మండంలం మాసాయిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి:భూపతిపూర్‌లో అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం!