తెలంగాణ

telangana

ETV Bharat / crime

Video Viral: స్థల విషయంలో వృద్ధుడిపై వ్యక్తి దాడి.. వీడియో వైరల్​ - guntur district news

Video Viral: ఏపీలోని గుంటూరు జిల్లాలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన వృద్ధుడు కోటేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Video Viral: స్థల విషయంలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి
Video Viral: స్థల విషయంలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి

By

Published : Apr 30, 2022, 7:44 PM IST

Video Viral: ఏపీలోని గుంటూరు జిల్లాలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన కోటేశ్వరరావు, శ్రీనివాసులకు ఏడు సెంట్ల స్థలం ఉంది. 2010లో దీన్ని అన్నదమ్ములిద్దరూ.. అన్నకి నాలుగు సెంట్లు, తమ్ముడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లుగా పంచుకుని నివాసముంటున్నారు. అయితే.. శ్రీనివాసరావుకు చెందిన మూడు సెంట్ల స్థలాన్ని నాగిరెడ్డి అనే వ్యక్తి ఇటీవల విక్రయించారు.

ఆ స్థలం వరకూ నాగిరెడ్డి గోడ నిర్మించుకోగా కోటేశ్వరరావు దాన్ని కూల్చివేశాడు. దీనిపై నాగిరెడ్డి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ ముదిరింది. వృద్ధుడైన కోటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నాగిరెడ్డి దాడి చేశాడు. కాళ్లతో తన్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. దాడికి పాల్పడ్డ నాగిరెడ్డి సాక్షి విలేకరిగా సమాచారం.

స్థల విషయంలో వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడి.. వీడియో వైరల్​

వృద్ధుడిపై దాడిని ఖండించిన లోకేశ్​: తాడేపల్లిలో సాక్షి సిబ్బంది సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియోను తన ట్విటర్​కు జతచేశారు. వైకాపా నాయకులు.. భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే సాక్షి సిబ్బంది తామేమైనా తక్కువ తిన్నామా అంటున్నారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి విలేఖరి నాగిరెడ్డి దాష్టీకం చూస్తుంటే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని అర్థమవుతుందన్నారు. ఆ స్థల యజమాని, వృద్ధుడు కాళ్లు పట్టుకొని చంపొద్దని ప్రాధేయపడినా.. దాడికి పాల్పడటం దారుణమన్నారు. అడ్డొచ్చిన మహిళను కాలితో తన్నిన నాగిరెడ్డి అరాచకాలకి అడ్డే లేకుండాపోయిందని లోకేశ్‌ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details