నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్తా... ప్రాణాల మీదకు తెచ్చింది. బర్దీపూర్‌కి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్... కత్తితో అన్న మతిన్ గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన మతిన్ను.. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
brother attack: క్షణికావేశం.. అన్న గొంతు కోసిన తమ్ముడు! - తెలంగాణ వార్తలు
అన్నదమ్ముల నడుమ చెలరేగిన ఘర్షణలు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా... గొంతుకోసే దాకా వచ్చాయి. అర్ధరాత్రి.. క్షణికావేశంలో తమ్ముడు అన్న గొంతు కోయగా... బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అన్న గొంతు కోసిన తమ్ముడు, అన్నపై తమ్ముడు దాడి
గతకొన్ని రోజుల నుంచి ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చినికి చినికి గాలివానలా తయారై గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చిందని వెల్లడించారు.మతిన్కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.
ఇదీ చదవండి:Viral Video: దారుణం: ట్యాబ్లెట్ ఇవ్వమని.. మెడికల్ షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం