Husband killed Wife in Hospital: కొంత కాలంగా ఉన్న విబేధాల కారణంగా భర్త.. భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా విజయలక్ష్మి ఏడాదిన్నరగా భర్తకు దూరంగా అదే గ్రామంలో వేరుగా ఉంటూ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తోంది.
పాఠశాల వద్ద భార్యను హత్య చేసిన భర్త.. అసలేం జరిగింది? - నెల్లూరు నేర వార్తలు
Husband killed Wife in Hospital: పాఠశాల వద్ద భార్యను హత్య చేసిన భర్త. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహకురాలిపై ఆమె భర్త కత్తితో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.
భార్యను హత్య చేసిన భర్త
వేరుగా ఉంటోందని కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్లు పాఠశాలలోనే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎదుటే ఈ ఘటన జరగడంతో విద్యార్థులు భయపడి పోయారు.
ఇవీ చదవండి: