కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి గొడ్డలితో అదే గ్రామానికి చెందిన చందుపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దారుణం: వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం - Kamareddy district latest news
కామారెడ్డి జిల్లా ఖత్గావ్లో ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అతన్ని బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
![దారుణం: వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం A Man attacked another man from the same village with an axe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10764888-99-10764888-1614186781619.jpg)
వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం
అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. తన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే చందుపై దాడి చేసినట్లు శంకర్ వివరించాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సాజిద్ తెలిపారు.