తెలంగాణ

telangana

ETV Bharat / crime

Anandayya medicine: ఆనందయ్య మందంటూ అమ్మకం.. వ్యక్తి అరెస్ట్ - Anandayya medicine

ఆనందయ్య మందు అని చెబుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ఔషధాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని ఏపీలోని తాడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనందయ్య మందు పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని.. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

thadikonda police arrest a man for selling fake anandaiah medicine
ఆనందయ్య మందు పేరుతో మోసం

By

Published : Jun 13, 2021, 11:02 PM IST

ఆనందయ్య మందు అని చెప్పి అక్రమంగా ఔషధాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని మోతడక గ్రామానికి చెందిన అన్నే కాంతారావు అనే వ్యక్తి.. కరోనా నివారణకు ఆనందయ్య ఔషధం తయారు చేస్తున్న మందు ఇదేనని చెప్పి స్థానికులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

ఆనందయ్య మందు పేరుతో కాంతారావు ప్రజల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇటువంటి వారిని నమ్మవద్దని.. ప్రజలకు సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:CLP:ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి

ABOUT THE AUTHOR

...view details