తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాలం చెల్లిన తినుబండారాలు విక్రయించే వ్యక్తి అరెస్ట్! - తెలంగాణ వార్తలు

కాలం చెల్లిన తినుబండారాలను విక్రయించే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు లంగర్​హౌస్ పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి లక్షా యాభై వేలు విలువ చేసే ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటన్నింటిని ఓ గిడ్డంగిలో నిల్వ చేస్తూ తేదీలు మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు.

a man arrest, langer house police
లంగర్​హౌస్ పోలీసులు తాజా వార్తలు, వ్యక్తి అరెస్ట్

By

Published : Apr 5, 2021, 5:14 PM IST

హైదరాబాద్‌ నగరంలో కాలం చెల్లిన తిను బండారాలను విక్రయిస్తున్న పంపిణీదారుడిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1లక్షా 50వేలు విలువ చేసే ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌జోన్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.

హల్దీ రామ్‌ పేరుగల తినుబండారాలను ఓ గిడ్డంగిలో నిల్వ చేస్తూ.. కాలం చెల్లిన వాటి తేదీలు మార్చి, కొత్తవి రాసి విక్రయిస్తున్నాడని తెలిపారు. కరోనా కారణంగా నష్టం రావడంతో డబ్బులకు ఆశపడి లక్ష్మీనారాయణ ఇలా చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details