తెలంగాణ

telangana

ETV Bharat / crime

Remdesivir: రెమిడెసివిర్ ఇంజక్షన్​ను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - తెలంగాణ వార్తలు

అక్రమంగా రెమిడెసివిర్(Remdesivir) ఇంజక్షన్​ను విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3400విలువ చేసే ఇంజక్షన్‌ను రూ.30వేలకు అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పంజాగుట్ట వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

 illegal remidivir injection, a man arrest
వ్యక్తి అరెస్ట్, రెమిడెసివిర్ ఇంజక్షన్ అక్రమ విక్రయం

By

Published : May 29, 2021, 7:55 PM IST

రెమిడెసివిర్(Remdesivir) ఇంజక్షన్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మదీనాగూడకు చెందిన ఎం.సంతోష్‌ రూ.3400విలువ చేసే ఇంజక్షన్‌ను రూ.30వేలకు పంజాగుట్టలో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి విచారణ కోసం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:Rmp clinics: ఆర్​ఎంపీ క్లినిక్​లలో కరోనా చికిత్స.. సీజ్ చేసిన అధికారులు..

ABOUT THE AUTHOR

...view details