వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీకి ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఉమర్ అనే డ్రైవర్ మృతి చెందాడు.
లారీకి తగిలిన విద్యుత్ తీగలు.. డ్రైవర్ మృతి! - vikarabad district crime news
లారీకి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డస్ట్లోడ్తో ఉన్న టిప్పర్ లారీ ఖాళీ చేస్తుండగా.. లారీకి ప్రమాదవశాత్తు హైటెన్షన్ కరెంట్ తీగలు తగిలాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల లారీ ముందు టైరు పేలిపోయింది. కరెంటు తీగలు తగిలిన విషయం గమనించని ఉమర్.. పేలిన టైరును చూసేందుకని లారీలోంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌కు షాక్ తగిలి అక్కడే కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న డ్రైవర్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించేలోపే ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.