తెలంగాణ

telangana

ETV Bharat / crime

Taramatipet ORR Lorry Accident : ఓఆర్​ఆర్​పై పెద్ద పెద్ద శబ్ధాలతో దగ్ధమైన లారీ - LORRY FIRE

Taramatipet ORR Lorry Accident : హైదరాబాద్ తారామతిపేట వద్ద బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్‌ మిక్సింగ్‌ లారీ.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో మంటలు చెలరేగాయి.

Taramatipet ORR Lorry Accident, LORRY FIRE
ఓఆర్​ఆర్​పై పెద్ద పెద్ద శబ్ధాలతో దగ్ధమైన లారీ

By

Published : Jan 5, 2022, 9:14 AM IST

Updated : Jan 5, 2022, 10:11 AM IST

Taramatipet ORR Lorry Accident : హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్​మెట్ మండలం తారామతిపేట వద్ద ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కాంక్రీట్‌ మిక్సింగ్‌ లారీ డీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. టైర్లు పేలి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

బాహ్యవలయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లారీ డ్రైవర్ ఘటనా స్థలంలో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓఆర్​ఆర్​పై పెద్ద పెద్ద శబ్ధాలతో దగ్ధమైన లారీ

ఇదీ చదవండి:Hyderabad name News: 'హైదరాబాద్‌ తొలిపేరు భాగ్యనగర్‌ కాదు'

Last Updated : Jan 5, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details