తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోడ కూలి పిల్లవాడు మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమం - Wall collapsed in Nimboli

A little boy died after the wall collapsed in the Kachiguda: ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. వచ్చాక మాాత్రం తీవ్ర విషాదాన్ని మిగిలిస్తుంది. అయితే గోల్నాక డివిజన్​లో ఈ ప్రమాదం చిన్న పిల్లలపై దాడి చేసింది. పిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం వస్తే వారికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది.

A little boy died after the wall collapsed
కూలిన గోడ ఒకరి మృతి

By

Published : Dec 21, 2022, 8:05 PM IST

A little boy died after the wall collapsed in the Kachiguda: గోల్నాక డివిజన్లోని నింబోలి అడ్డు ప్రాంతంలో కాచిగూడకు చెందిన సతేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా పక్కన ఉన్న గోడ కూలిపోయింది. అదే సమయంలో గోడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపై ఆ గోడ పడింది. దీంతో వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన దీరాసింగ్​​కి 6 సంవత్సరాలు, గాయాలు తగిలిన రాధికకు 5 సంవత్సరాలు ఉంటాయని పోలీసు​లు తెలిపారు.

గాయాలు తగిలిన రాధిక

ఈ పిల్లలు ఇద్దరు రాజస్థాన్​కి చెందిన వారిగా గుర్తించారు. రాజస్థాన్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి కుటుంబానికి ఇలా జరగడం బాధాకరమని, ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకొంటామని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details