4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి - Telangana-Chhattisgarh border News
![4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి A jawan shot dead four soldiers on the Telangana-Chhattisgarh border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13571284-826-13571284-1636334788600.jpg)
06:50 November 08
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ తన సహచరులపైనే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారు. సుకుమా జిల్లా మారాయిగూడెం పరిధిలోని లింగంపల్లి 50వ బెటాలియన్ బేస్ క్యాంప్‌లో జవాన్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీపావళి అనంతరం సెలవుల విషయంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది. రితేశ్ రంజన్ అనే జవాన్ మిగిలిన వారిపై కాల్పులు జరపగా.... ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటినా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో మరొకరు మృతిచెందారు. కాల్పులు జరిపిన జవాన్ రితేశ్ రంజన్‌ను సీఆర్పీఎఫ్ కస్టడీలో ఉన్నాడు.
తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, పశ్చిమ బంగాల్‌కు చెందిన రాజీవ్‌మండల్, ధర్మేందర్‌గా గుర్తించారు. ధర్మాత్మ కుమార్, మహారాణా, ధనుంజయ్ సింగ్‌లకు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన నలుగురి మృతదేహాలకు భద్రాచలం ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వగ్రామాలకు తరలించనున్నారు.