తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి యువకుడి మృతి

విహారయాత్ర కోసం హైదరాబాద్​ నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్లిన బృందంలో విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో జారిపడి.. ఓ యువకుడు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad
Hyderabad

By

Published : Feb 5, 2023, 10:46 PM IST

కేరళలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్​కు చెందిన కొందరు వ్యక్తులు కేరళ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగానే ఇడుక్కి జిల్లా మున్నార్ సమీపంలోని చునయమ్మక్కల్ జలపాతం వద్దకు వెళ్లారు.

మృతుడు సందీప్

ఈ క్రమంలోనే కొత్తపేటకు చెందిన సందీప్​ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు వెతకగా సందీప్​ మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details