తెలంగాణ

telangana

ETV Bharat / crime

దేవుడి ముందు దీపం పెడితే కోతులొచ్చి ఇంటికి నిప్పంటించాయి.. - జోగులాంబ గద్వాల జిల్లా నేర వార్తలు

Hut Was Burnt in Jogulamba Gadwala District: మనం ఎక్కడైనా షార్ట్ సర్క్యూటై ఇల్లు దహనం అవటం చూసుంటాం. లేదా తగాదాలలో వేరే వాళ్లు దహనం చేయటం చూసుంటాం. ​కానీ ఇక్కడ అవేవి జరగలేదు. ఇంట్లో ఎవరు లేని సమయంలో కోతులు ఇంట్లోకి వెళ్లి దేవుడి దగ్గర పెట్టిన దీపాన్ని పడేశాయి. దీంతో గుడిసె మొత్తానికి నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉన్నదంతా అగ్నికి ఆహుతైంది.

Jogulamba Gadwala District
Jogulamba Gadwala District

By

Published : Jan 9, 2023, 4:55 PM IST

Updated : Jan 9, 2023, 6:33 PM IST

దేవుడి ముందు దీపం పెడితే కోతులొచ్చి ఇంటికి నిప్పంటించాయి..

Hut Was Burnt in Jogulamba Gadwala District: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో గుడిసె దగ్ధమైంది. ఓ ఇంటి మిద్దెపై మేదరి ఎల్లయ్య గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని కుటుంబీకులు బయటకు వెళ్లగా, కోతులు ఇంట్లోకి వెళ్లి పూజ గదిలో ఉన్న దీపాన్ని పడేయడంతో గుడిసెకు నిప్పంటుకుంది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఇంట్లో ఉన్న 2లక్షల నగదు, 2తులాల బంగారం, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు కౌన్సిలర్ నాగిరెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details