Murder: పెళ్లైన నెలకే భార్యపై అనుమానం.. గొంతు కోసి హత్య, ఆపై ఆత్మహత్యాయత్నం - హైదరాబాద్ వార్తలు
11:27 September 26
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం(husband murdered wife) చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను కిరాతకంగా హత్య(husband murdered wife) చేశాడు. అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కిరణ్, సుధారాణి(22) భార్యాభర్తలు. వీరికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో కిరణ్.. ఆమె గొంతు కోసి(husband murdered wife) చంపాడు. అనంతరం చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుధారాణి మృతదేహాన్ని(husband murdered wife) పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి:నగ్న మృతదేహం కేసు: ఆటోడ్రైవర్‌పై రౌడీషీటర్ కక్ష.. మందు పార్టీ ఇచ్చి మరీ..