తెలంగాణ

telangana

ETV Bharat / crime

Husband killed wife at Teegalapahad : భార్యను హతమార్చిన భర్త.. ఆపై పోలీసుల ఎదుట.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Husband killed wife at Teegalapahad : కుటుంబకలహాలతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా తీగల పహాడ్​లో జరిగింది.

Husband killed wife at Teegalapahad , wife murder case
భార్యను హతమార్చిన భర్త

By

Published : Jan 24, 2022, 1:01 PM IST

Husband killed wife at Teegalapahad : మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలం తీగల పహాడ్​లో దారుణం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు నగర్​లో భార్యను భర్త హతమార్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఏం జరిగింది?

Teegalapahad Murder case : తీగల పహాడ్​లోని అల్లూరి సీతారామరాజు నగర్​లో విజయ్ అనే వ్యక్తి తన భార్యను చంపేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడి... కోపంతో భార్య అలేఖ్యను తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్​గా పని చేసే విజయ్ కుటుంబం... నెల రోజుల క్రితం నుంచే అల్లూరి సీతారామరాజు నగర్​లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీరాంపూర్ సీఐ సంజీవ్... విచారణ చేపట్టారు.

తల్లి చంపిన కుమారుడు

మరో ఘటనలో తల్లిని కుమారుడు కొట్టి చంపాడు. హైదరాబాద్​లోని సుల్తాన్‌బజార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుమారుడు తల్లిని రాడ్డుతో తలపై కొట్టి చంపాడు. సుల్తాన్​బజార్​కు చెందిన సుధీర్​కు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే అతను అర్ధరాత్రి లేచి వ్యాయామం చేయడం ప్రారంభించాడు.

రాడ్డుతో బలంగా కొట్టి..

కుమారుడు ఆ సమయంలో వ్యాయామం చేయడం చూసిన తల్లి.. అతనిని మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్.. చేతిలో రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లిపై కూడా రాడ్​తో దాడి చేశాడు. తల్లి చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Mirchi Farmers Protest: ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details