తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానంతో భార్యను చంపిన భర్త - Ramchandar case in Kamareddy

A husband killed his wife out of shame in Kamareddy district: ఎవ్వరు ఏమి చేసినా దాన్ని కొంత మంది వ్యక్తులు అనుమానిస్తారు. అదే భార్యాభర్తల విషయంలో మరీ ఎక్కువ. భార్యపై నమ్మకం లేనప్పుడే అనుమానం ఏర్పడుతోంది. మరి కొందరూ కావాలనే అనుమానిస్తారు. ఆ అనుమానమే పెనుభూతంగా మారుతుంది. క్షణికావేశంలో ఎదుటివారిని చంపడానికి కూడా వెనకాడని స్థితికి తీసుకొస్తుంది. ఇదే తరహాలో కామారెడ్డి జిల్లాలో ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చాడు.

A husband killed his wife out of shame
అనుమానంతో భార్యను చంపిన భర్త

By

Published : Dec 21, 2022, 3:40 PM IST

A husband killed his wife out of shame in Kamareddy district: భార్యపై అనుమానంతో భర్త ఆమెను విచక్షణ రహితంగా కొట్టి చంపేశాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా నసురుళ్లబాధ్ మండలంలోని అంకొల్​ తండాకి చెందిన రాంచందర్ కొన్ని రోజులుగా తన భార్య సోని(20)ని అనుమానిస్తూ ఉండేవాడు. రోజూ శారీరకంగా, మానసికంగా హింసిచే వాడు. చివరకు అనుమానం పెనుభూతంలా మారి ఈరోజు భార్య చేయి మనికట్టు దగ్గర కత్తితో కోసి, గొంతు నలిపి చంపేశాడు.

దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆమెను తాడుతో దూలానికి వేలాడదీసి పారిపోయాడు. గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామచంద్రే చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు​లు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సోని మృతదేహన్ని పోస్ట్​మర్టం నిమిత్తం బాన్సువాడ ప్రాంతంలోని హాస్పిటల్​కి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details