Illegal Affair : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి చేశాడు భర్త. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన రాజేశం.. తన భార్యతో కలిసి కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌లో ఉంటున్నారు. అతడి భార్య అటవీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అదే కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న శశిధర్‌తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజేశం ఆరోపిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వారి మధ్య సంబంధం ఉందని.. తనని ఇబ్బంది పెడుతుందని.. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేసినా ఆధారాలు చూపించమనడంతో ఓ ప్లాన్ వేశాడు.
Illegal Affair : గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే.. - భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి
Illegal Affair : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి దేహశుద్ధి చేశాడు ఆమె భర్త. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్‌లో జరిగింది. ఇద్దరూ గదిలో ఉండగా తాళం వేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సమక్షంలో అతడికి దేహశుద్ధి చేశాడు.
![Illegal Affair : గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే.. Illegal Affair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14569707-494-14569707-1645797295316.jpg)
Illegal Affair
గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..
తన భార్య, టైపిస్టు శశిధర్... ఇంట్లోని ఓకే గదిలో ఉండగా.. గదికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తాళం తెరిచి చూడగా.. వారిద్దరిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. శశిధర్‌కు దేహశుద్ధి చేశాడు. అయితే తనతో మాట్లాడే పని ఉందని ఇంటికి పిలిచి తనపై దాడి చేశాడని శశిధర్ ఆరోపిస్తున్నాడు. పోలీసులు శశిధర్‌ను, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి :మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు
Last Updated : Feb 25, 2022, 9:50 PM IST