దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో భారీ స్కామ్ - దీపం వత్తులు బొట్టు బిళ్లల తయారీ పేరుతో భారీ మోసం
12:41 November 28
దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో.. భాగ్యనగరంలో భారీ మోసం
Huge Fraud In Hyderabad: హైదరాబాద్‌లో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లలు తయారీ పేరుతో కొందరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. అమాయకులను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలను దోచుకుని బోర్డు తిప్పేశారు. మోసపోయిన సుమారు 1,100మంది బాధితులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారికీ కొల్లు రమేశ్ అనే వ్యక్తి కొంతమందికి యంత్రాలు అమ్మాడు. దీపం వత్తుల యంత్రం రూ.1.70లక్షలకు, బొట్టుబిళ్లల యంత్రం రూ.1.40లక్షలకు విక్రయించాడు. ముడిసరుకు ఇచ్చి తయారు చేస్తే కిలోల చొప్పున నిర్వాహకుడు డబ్బు చెల్లిస్తానన్నాడు. బొట్టుబిళ్లలకు కిలో రూ.600, దీపం వత్తులు కిలో రూ.300 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. యంత్రాలు విక్రయించాక నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఏఎస్‌రావునగర్‌లో ఆర్‌ఆర్‌ఎంటర్ ప్రైజెస్ పేరుతో యంత్రాల విక్రయం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వందల మందికి నిర్వాహకుడు యంత్రాలు విక్రయించాడు. 2021 నుంచి నిర్వాహకుడు యంత్రాలు విక్రయిస్తున్నాడు. యూట్యూబ్‌లో చూసి బాధితులు యంత్రాలు కొనుగోలు చేశారు. చివరికి తాము మోసపోయామని తెలుసుకుని కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: