FIRE ACCIDENT: వెల్డింగ్ చేస్తుండగా మంటలు.. నష్టం ఎంతంటే.. - తెలంగాణ తాజా వార్తలు
11:22 August 12
FIRE ACCIDENT: ప్లాస్టిక్ బాటిల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడ శివారులోని ప్రసిద్ధ ప్లాస్టిక్ బాటిల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి.
వెంటనే అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: Honey trap: ఆమె 'వలపు వల' నుంచి నా కొడుకుని కాపాడండి.. ఓ తండ్రి వేడుకోలు