తెలంగాణ

telangana

ETV Bharat / crime

FIRE ACCIDENT: కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - Katedan industrial area

FIRE ACCIDENT: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి పోలీస్​స్టేషన్‌ పరిధిలోని కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

FIRE ACCIDENT: కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
FIRE ACCIDENT: కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Apr 16, 2022, 12:09 AM IST

FIRE ACCIDENT: హైదరాబాద్​ నగర శివారు మైలార్​దేవుపల్లి పోలీస్​స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ లామినేషన్ ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేమ్ చౌదరి అనే వ్యక్తికి చెందిన పీఆర్ పాలిమర్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో పూర్తిగా ప్లాస్టిక్ కవర్ రోల్స్, ప్రింటింగ్​కు సంబంధించిన కెమికల్ డబ్బాలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫలితంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలో ఎలాంటి ముందస్తు ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడంతో మంటలు తీవ్రరూపం దాల్చాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details