fire Accident: కార్ల మరమ్మత్తు గ్యారేజ్‌లో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది. హైదరాబాద్ అత్తాపూర్‌లోని బెర్లిన్ గ్యారేజీలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో గ్యారేజీలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు ఖరీదైన కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఇతర కార్లను సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
బెర్లిన్ గ్యారేజీని ఆనుకుని ఉన్న మరో కార్ల మరమ్మత్తు గ్యారేజ్‌లో మొదట మంటలు చెలరేగి ఆ మంటలు తమ గ్యారేజ్‌లోకి వ్యాపించాయని బాధితులు తెలిపారు. ఈ కారణంగానే తమ గ్యారేజ్‌లో ప్రమాదం జరిగిందన్నారు. తరచూ తుక్కుకు నిప్పు పెట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.