మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గ్రనేడ్ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కొండ ప్రాంతంలో గ్రనేడ్ లభ్యమైంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పశువులను మేపుతుండగా గ్రనేడ్ కనిపించగా... ఈ విషయాన్ని సర్పంచ్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు.
మహబూబ్నగర్లో గ్రనేడ్ కలకలం... ఎవరు దాచారో.. ?
మహబూబ్నగర్ జిల్లాలో గ్రనేడ్ కలకలం రేపింది. జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గుట్ట ప్రాంతంలో లభ్యమైంది. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఎవరికి సంబంధించినదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్నగర్లో గ్రనేడ్ కలకలం... ఎవరికి సంబంధించినది?
ఇదే ప్రాంతంలో ఇంకా వేరేచోట మరేమైనా ఉన్నాయా అని మహబూబ్నగర్ గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. ఈ గ్రనేడ్ మావోయిస్టులకు సంబంధించినదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అందాల లోగిలి.. మృత్యు కౌగిలి