తెలంగాణ

telangana

ETV Bharat / crime

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. విడిపోయిన బోగీలు.. ఆ తర్వాత.. - A goods train derailed news

స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. కానీ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

A goods train derailed at station Ghanpur
పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

By

Published : Jul 6, 2022, 4:20 PM IST

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్నూలు నుంచి కాజీపేట్‌ వెళ్తున్న రైలులోని 11, 12 బోగీలు విడిపోయాయి. అనంతరం రైలు సుమారు 300 మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. రెండు బోగీలు పూర్తిగా విడిపోవడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ABOUT THE AUTHOR

...view details