ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో చోటు చేసుకుంది. గతేడాది ఓ యువకుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.
మైనర్‌పై అత్యాచారం.. ముగ్గురు యువకులపై కేసు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.
మైనర్‌పై అత్యాచారం.. ముగ్గురు యువకులపై కేసు
ఆ బాలికపై బలాత్కారం చేయడమే కాకుండా ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామని భయ బ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. ఈ కేసులో నిందితుడితోపాటు.. అతనికి పరోక్షంగా సహకరించారనే ఫిర్యాదు మేరకు.. మరో ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి, సాక్షులను విచారించారని తెలిపిన సీఐ.. దర్యాప్తు పూర్తికాగానే నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:బెడ్‌షీట్స్ మాటున.. ఎర్రచందనం అక్రమ రవాణా