హైదరాబాద్లో మరో దారుణం.. బాలికపై ఐదుగురు అత్యాచారం - పోక్సో చట్టం
10:13 November 29
హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలో బాలికపై ఐదుగురు అత్యాచారం
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియోలు పెడతామని బాలికను బెదిరించారు. పది రోజుల తర్వాత మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా అత్యాచార వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: