అకస్మాత్తుగా వీచిన గాలికి రేకుల షెడ్డు కూలిపడింది. ప్రమాదంలో షెడ్డు లోపల ఆడుకుంటున్న బాలికపై పడడం వల్ల తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.
రేకుల షెడ్డు కూలిపడి బాలిక మృతి - భద్రాద్రి కొత్తగూడెం వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలో విషాదం జరిగింది. రేకుల షెడ్డు కూలిపడిన ఘటనలో ఏడేళ్ల బాలిక మృతి చెందింది.
అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన వెంకన్న శిరీష దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె కీర్తి మరో బాలికతో కలిసి ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వీచిన గాలికి శిథిమై ఉన్న షెడ్డు కూలిపోయింది. ఇద్దరు చిన్నారులు భయంతో బయటకు పరిగెత్తేలోగా షెడ్డుకూలిపడింది. ప్రమాదంలో కీర్తి తీవ్రంగా గాయపడింది.
గాయపడిన చిన్నారిని భద్రాచలంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. కీర్తి స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దారు, పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.