నిరక్షరాస్యులు, పేద వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో కొత్త తరహా మోసానికి తెరలేపింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఎక్కువగా నివసించే గాజువాక ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారికి రూ. 500 చెల్లిస్తామని ప్రచారం చేసింది. డబ్బు వస్తుందని ఆశపడ్డ స్థానిక మహిళలు వారి మాయమాటలు నమ్మారు.
ఈ ముఠా ప్రజల నుంచి అధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సేకరించి.. వారి వేలిముద్రలను సేకరించింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగడంతో ముఠాలోని ఇద్దరు సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల్లో పట్టుకున్న యువకులు పోలీసులకు సమాచారం అందించారు.