నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. కారు వెనక్కి తీస్తుండగా.. కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మండల కేంద్రంలోని రాజ్‌నగర్ దుబ్బా ప్రాంతంలో సీయోను చర్చి సమీపంలో పొలాస శ్రీనాథ్, గజశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటి వద్ద బెలోనో కారు టైరు మురుగుకాలువలో ఇరుక్కుపోయింది. దీనితో బాలుడి తండ్రి డ్రైవర్‌కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. డ్రైవర్ వెనక్కి తీస్తుండగా.. శ్రీనాథ్ టైరును పైకి లేపుతున్నాడు.
Accident: కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం.. ఐదేళ్ల బాలుడి మృతి - కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం
కారు వెనక్కి తీస్తుండగా చక్రాల కింద పడి ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

car accident
ఈ క్రమంలో కారు వేగంగా వెనక్కి వచ్చి.. గేటు సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో.. హర్షవర్ధన్(05) అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి గజశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.