విజయనగరం జిల్లా వింధ్యవాసిలో అగ్నిప్రమాదం - విజయనగరం వింధ్యవాసిలో అగ్నిప్రమాదం
10:35 September 21
విజయనగరం జిల్లా వింధ్యవాసిలో అగ్నిప్రమాదం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వింధ్యవాసిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలధాటికి అక్కడే ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడం వల్ల వ్యాపించిన మంటలతో మరో మూడు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.
స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి తరలివచ్చారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. కానీ.. రూ.9 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమై ఉంటాయని, ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.