హైదర్‌గుడాలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు - hyderabad fire accidents
10:02 January 16
Fire Accident in Apartment: ఐదో అంతస్తులో ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్ హైదర్‌గుడాలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో.. మిగిలిన ప్లాట్‌లో ఉన్న వారిని ఖాళీ చేయించారు.
శనివారం రాత్రి అపార్ట్మెంట్ యజమాని రాము ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడని.. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనానికి అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థ సక్రమంగా లేదని.. స్థానికులు తెలిపారు. మంటలకు ప్లాట్ గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయని... ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైందని వెల్లడించారు.
ఇదీ చూడండి:Fire Accident in Military Club: సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తినష్టం!