యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముత్యాలమ్మ బావి వద్ద ఔషధాలతో నిలిపి ఉంచిన ఓ డీసీఎం వాహనానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. రాత్రి 11 గంటల సమయంలో మంటలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పి వేశారు. ప్రమాద సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.