Fire in car in Sarapaka at petrol bunk : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పెట్రోల్ పోయించుకునేందుకు బంకు వద్దకు వెళ్లిన కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. సారపాకకు చెందిన పొలసాని ఆదిరెడ్డి కారులోని హెడ్‌లైట్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది... కారుని పెట్రోల్ బంకు నుంచి బయటకు నెట్టేశారు.
Fire in car in Sarapaka at petrol bunk: పెట్రోల్ కోసం బంకుకు వస్తే మంటలొచ్చాయి.. - తెలంగాణ తాజా వార్తలు
Fire in car in Sarapaka at petrol bunk : పెట్రోల్ పోయించుకునేందుకు బంకుకు వెళ్లిన కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హెడ్ లైట్ల నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి... కారు దగ్ధమైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగింది.
పెట్రోల్ కోసం బంకుకు వచ్చిన కారులో మంటలు..
కారులో ఉన్న వ్యక్తి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది... మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ఏం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..
Last Updated : Jan 31, 2022, 9:50 AM IST